డబుల్ హౌస్.. డబుల్ జోష్.. ఇంటికెళ్లిన ఆ కంటెస్టంట్ ఎవరు? : బిగ్ బాస్ 9 లాంచ్ ప్రోమో

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-18 14:17:16  IST  )

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

డబుల్ హౌస్.. డబుల్ జోష్.. ఇంటికెళ్లిన ఆ కంటెస్టంట్ ఎవరు? : బిగ్ బాస్ 9 లాంచ్ ప్రోమో
X

దిశ, సినిమా: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో సీజన్ ప్రారంభం కానుండగా.. మేకర్స్ 2 నిమిషాల 29 సెకన్ల నిడివితో రిలీజ్ చేసిన లాంచ్ ప్రోమో సీజన్ పై అంచనాలను పెంచింది. ఒక హౌస్ ఉంటే చదరంగం.. రెండో హౌస్ తో రణరంగమేనని నాగ్ చెప్పిన డైలాగ్ ప్రోమోకి హైలైట్గా నిలిచింది. ఇక హోస్ట్ గా నాగ్ లుక్ అదిరిపోయింది.

ఊహకందని మార్పులు.. ఊహించని మలుపులు.. డబుల్ హౌస్, డబుల్ జోష్ తో బిగ్ బాస్ సీజన్ 9 లాంచ్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా లో టెలీకాస్ట్ కానుంది. ఒక పక్క ఆశ, మరో పక్క ఆశయం.. ఈ రణరంగాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలని నాగార్జున చెప్పారు. ఎప్పటిలాగానే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఫేసుల్ని రివీల్ చేయకుండానే ప్రోమో లాంచ్ చేశారు. అయితే వారిలో ఒకరు హౌస్ లోకి ఒక వస్తువుని తీసుకెళ్లాలని కోరగా.. అందుకు బిగ్ బాస్ నిరాకరించినట్లు చూపించారు. దాంతో అతను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను అన్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరన్నది చూపించకుండా మరింత ఆసక్తిని పెంచారు. మరి హౌస్ లోకి వెళ్లేది ఎవరెవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Next Story