- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో తీవ్ర విషాదం.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్
బిగ్ బాస్ బ్యూటీ హిమజ(Himaja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ సీరియల్స్‌లలో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ ఫేమ్‌తో వెండితెరపై అడుగుపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ హిమజ(Himaja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ సీరియల్స్‌లలో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ ఫేమ్‌తో వెండితెరపై అడుగుపెట్టింది. అలా ‘చిత్రలహరి’(Chitralahari), ‘వినయ విధేయ రామ’(Vinaya Vidheya Rama), ‘జంబలకడిపంబ’(Jambalakidi Pamba), ‘ఉన్నది ఒకటే జిందగీ’(Vunnadhi Okate Zindagi), ‘స్పైడర్’(Spider) వంటి తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’(Bigg Boss-3) సీజన్ 3 అడుగుపెట్టి తన డేరింగ్ అండ్ డాషింగ్ ఆటతీరుతో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలో ఈ భామ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హిమజ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ భావోద్వేగ వీడియో షేర్ చేశారు.
“పైనున్న స్వర్గం తన లివింగ్ సోల్‌ను తీసుకెళ్లిపోయింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను నాన్న.. మీరు నాతో లేరన్న భాధను మాటల్లో చెప్పలేను” అంటూ తండ్రితో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ హిమజ కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హిమజకు ధైర్యం చెబుతూ బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






