- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఛీ ఛీ సిగ్గుండాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్
బిగ్ బాస్ బ్యూటీ సిరిహనుమంత్(Siri Hanumanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్(Siri Hanumanth) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్‌లో యాక్ట్ చేసిన ఈ చిన్నది ఆ తర్వాత అనేక షోల్లో పాల్గొంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్‌తో రచ్చ చేసేది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ యూట్యూబర్ షణ్ముష్ జస్వంత్(Shanmukh Jaswanth)తో ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా అతనికి ముద్దులు, హక్కులు ఇచ్చి విరక్తి కలిగేలా చేసుకుంది. దీంతో ఈ చిన్నదానిని హౌస్ నుంచి బయటకు వచ్చింది. బయటికు వచ్చాక కూడా ఫుల్లుగా ట్రోల్స్‌కి గురైంది. ఇక ఈ చిన్నది యాక్టర్ శ్రీహాన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ళుగా లవ్ చేసుకుంటున్న ఈ కపుల్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సిరి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో తన బాయ్ ఫ్రెండ్‌తో వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రిలేషన్ షిప్‌లో ఉండి ఇలా చేసుకుంటారా అని, పెళ్లి చేసుకోకుండా ఏంటి ఇవ్వన్ని.. ఏదో గొప్ప సందేశం అన్నట్టు పబ్లిక్‌లో పోస్ట్ చేస్తారు.. పెద్ద సినిమా సెలబ్రిటీలు కూడా పెళ్లికి ముందు చాలా సైలెంట్‌గా ఉంటారు.. ఈ సీరియల్ యాక్టర్స్‌ని మాత్రం ఆపలేకపోతున్నాం.. ఓవర్ యాక్షన్.. ఫేక్ పబ్లిసిటీ అంతా ఫేక్ యాడ్స్ అంటూ మండిపడుతున్నారు.






