హనీమూన్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-03 13:42:13  IST  )

నటి సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హనీమూన్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్లి అక్కడ తన గేమ్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ఈ భామ అక్కడ చాలా హంగామా చేసింది. అయితే ముఖ్యంగా ఈ బ్యూటీ పాజిటివిటీ కంటే ఎక్కువగా నెగిటివిటి సొంతం చేసుకుందనే చెప్పాలి. నిఖిల్‌(Nikhil)తో లవ్ అంటూ అనేక ట్రోల్స్ వచ్చాయి. కానీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని తనపై వచ్చిన రూమర్స్‌కు గట్టి కౌంటర్స్ ఇచ్చింది.

ప్రస్తుతం తన భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇక వాటిని సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సోనియ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో చైనాలో హనీ మూన్‌లో తన హస్బెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘యష్ వీరగోనితో మా 137వ రోజును చైనాలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెళ్లి రోజు నుంచి ఇప్పుడు 137 రోజు వరకు మా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చాయి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story