- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి కాకుండానే ఫస్ట్ యానివర్సరీ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఇదేం చెండాలం అంటూ కామెంట్స్
‘కార్తీక దీపం’(Karthika Deepam) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ శోభా శెట్టి(Shobha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘కార్తీక దీపం’(Karthika Deepam) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ శోభా శెట్టి(Shobha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌లో నెగెటీవ్ రోల్‌లో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో బిగ్‌బాస్ సీజన్-8లో అడుగు పెట్టే చాన్స్ వచ్చింది. అక్కడ కంటెస్టెంట్‌గా వెళ్లిన ఈ బ్యూటీ తన ఆటతో, మాటలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. అయితే విన్నర్ మాత్రం కాలేక పోయింది. అయితే హౌస్‌లో ఉన్నప్పుడే సీరియల్ యాక్టర్ అయినటువంటి యశ్వంత్ రెడ్డి(Yaswanth Reddy)తో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక హౌజ్ నుండి బయటకు వచ్చాక ప్రియుడితో కలిసి న్యూ హౌస్ కొన్నది. అలా కొత్తింట్లో పెళ్లి చేసుకోకుండానే వ్రతాలు, పూజలు చేయడంతో ఆ సమయంలో కొందరు శోభా శెట్టిని ట్రోల్ చేశారు. ఈ క్రమంలో మరో మారు నెట్టింట ట్రోల్ అవుతుంది శోభా శెట్టి. వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్రియుడు యశ్వంత్‌తో నిశ్చితార్థం చేసుకున్న చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక వీరి నిశ్చితార్థం చేసుకుని ఏడాది పూర్తి కావడంతో.. తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా పలు ఫొటోలు షేర్ చేసింది. వాటికి ‘హే పాపూ మా.. ఇది మన 1వ సంవత్సర నిశ్చితార్థ వార్షికోత్సవం.. మనం కలుసుకుని దాదాపు 5 సంవత్సరాలు అయింది. అంతులేని ప్రేమ, రోజంతా ఆప్యాయత, ప్రతి రోజు ఆరాధన.. నా ప్రేమకు 1వ సంవత్సర నిశ్చితార్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు పెళ్లి కాకుండానే యానివర్సరీ ఏంటి ఈ చెండాలం అని, నిశ్చితార్థం అయి ఏడాది అయింది మరి పెళ్లెప్పుడు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.






