తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ శివ జ్యోతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ శివ జ్యోతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ సావిత్రి(Savitri)గా పరిచయమైన శివ జ్యోతి (Shiva Jyoti) ఓ న్యూస్ ఛానల్‌లో తీన్మార్ కథలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అక్కడ తన ఆటతీరుతో మెప్పించినప్పటికీ ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అవుతూ డ్రామా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఈ చిన్నది తన కంటూ ఓ సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పలు వ్లాగ్స్ చేస్తూ మరింత ఫేమ్ అయింది.

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న గంగూలీ(Ganguli)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మ్యారేజ్ అయిన దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ చిన్నది తల్లి కాబోతుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో తన బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని చాలా హ్యాపీగా కనిపించింది.

ఇక బేబీ బంప్‌ను పట్టుకొని ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. అయితే వీటికి.. ‘నా హృదయంలో శాశ్వతంగా నడవడానికి… ఒక చిన్న జంట పాదాల కోసం నేను ఎదురు చూస్తున్నాను’ అంటూ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ హార్ట్ సింబల్స్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు మీకు అబ్బాయి పుడతారని, అమ్మాయి పుడతారని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story