మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. చీ చీ అక్కడ కూడా ఆ పని చేయడం ఆపరా అంటూ నెట్టింట చీవాట్ల జల్లు(పోస్ట్)

by I. Sairam |

‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మహా కుంభమేళాలో బిగ్ బాస్ బ్యూటీ.. చీ చీ అక్కడ కూడా ఆ పని చేయడం ఆపరా అంటూ నెట్టింట చీవాట్ల జల్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా టీవీ(MAA)లో ప్రసారమయ్యే ఈ ధారావాహికకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’(Janaki Kalaganaledhu) సీరియల్‌లో నటించి మరింత ఫేమ్ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) సీజన్-7లో కంటెస్టెంట్‌గా వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన ఆటతీరు, మాటతీరుతో కొంత పాజిటివిటీ, మరికొంత నెగిటివిటిని తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ టాప్ ఫైవ్ కంటెస్టెంగా బిగ్ హౌస్‌లో నిలిచింది.

కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఓ యూట్యూబ్ చానల్(Youtube Channel) పెట్టి తన ప్రియుడితో చేసిన రీల్స్, వ్లాగ్స్ పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక జైన్ మహా కుంభమేళాలో తళుక్కుమంది. తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివ కుమార్(Shivakumar)తో కలిసి ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంది.

పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన కుంభమేళాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో కొద్ది క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లలో చాలామంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. ‘దేవుడి దగ్గర కూడా ఫొటో షూట్స్, రీల్స్ అవసరమా? మీరు వెళ్లింది భక్తి కోసమా లేక ఇన్ స్టా స్టోరీల కోసమా? అంటూ చీవాట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం గుర్తుగా ఉండటం కోసం రీల్స్, ఫొటోలు తీసుకున్నారు అందులో తప్పేముందని ఈ జంటకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.

Next Story