- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు లవ్ స్టోరీ పై నోరు విప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. అతను నో అనేసరికి అలా చేశానంటూ కామెంట్స్
స్టార్ మా(STAR MAA)లో ప్రసారమయిన ‘కార్తిక దీపం’(Kartheeka Deepam) సీరియల్‌కి ఎంత ఆదరణ దక్కిందో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ మా(STAR MAA)లో ప్రసారమయిన ‘కార్తిక దీపం’(Kartheeka Deepam) సీరియల్‌కి ఎంత ఆదరణ దక్కిందో మనందరికీ తెలిసిందే. ఇందులో మోనిత అనే విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టి(Shobha Shetty)కి కూడా అంతే పాపులారిటీ వచ్చింది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) హౌస్‌లోకి వెళ్ళే చాన్స్ వచ్చింది. అక్కడ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ చిన్నది తన కన్నింగ్ మైండ్ సెట్‌తో పిచ్చిలేపింది. సీరియల్స్ బ్యాచ్‌తో కలిసి నానా హంగామా చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన తెలుగు ఆడియన్స్ ఈ చిన్నదాన్ని హౌస్‌లో నుంచి బయటికి పంపించేశారు. ఇక హౌస్‌లో ఉన్నప్పుడే తన లవ్ స్టోరీ గురించి ఈ ముద్దుగుమ్మ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. యశ్వంత్(Yashwanth) అనే నటుడిని ఇష్ట పడుతున్న అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ బయటకు వచ్చాక ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ప్రస్తుతం అతనితో రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా శోభా శెట్టి ఓ షోకు గెస్టుగా వెళ్లింది. అయితే అక్కడ తన లవ్ స్టోరీ గురించి ప్రస్తావన రాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా అన్ని సమస్యలు తీరిపోయి సెటిల్ అయ్యాను. కష్టాలు అయిపోయాయి అనుకున్నాక ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నేను రాఘవేంద్ర స్వామిని బాగా నమ్ముతాను. సంబంధాలు చూడటం మొదలుపెట్టాక మంత్రాలయం వెళ్లి దండం పెట్టుకున్నా. నువ్వు ఎవర్ని చూపిస్తే వాళ్లనే చేసుకుంటాను అని రాఘవేంద్ర స్వామికి చెప్పాను. అక్కడి నుంచి వచ్చాక ఓ 20 రోజుల గ్యాప్‌లో షూటింగ్ షెడ్యూల్‌లో యశ్వంత్‌ని క్యాజువల్‌గా చూశాను. అతను కూడా చూశాడు. అలా రెండు మూడు సార్లు చూసుకున్నాం. అప్పటికే చాలా రోజుల నుంచి కలిసి పని చేస్తున్నాం కానీ స్పెషల్ ఏమి లేదు.
ఆ రోజు చూశాక నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడు ఎందుకు చూశావు అని. అలా మాట్లాడటం మొదలయి ప్రేమలో పడ్డాను. యశ్వంత్‌ని దేవుడే ఇచ్చాడని నమ్మాను. 5 ఏళ్ళు లవ్ మాది. నేనే మొదట ప్రపోజ్ చేశా. అతను ఒప్పుకోలేదు. లైఫ్‌లో సెటిల్ అవ్వలేదని, ఇంకా ఏవో కారణాలు చెప్పి నా ప్రేమని ఒప్పుకోలేదు. కానీ నేను అతని వెనక తిరిగా. కొన్నాళ్ళకు ఒప్పుకున్నాడు. మా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈ ఇయర్ ఫిబ్రవరి, మార్చ్‌లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ మా అమ్మకు హెల్త్ బాగోలేదు. మా అమ్మకు నా పెళ్లి గ్రాండ్‌గా చేయాలని కల. మా అమ్మ హెల్త్ సెట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ మొదట్లో చేసుకుంటాము’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






