- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DIVI: ‘రోజులు లెక్కబెడుతోన్న చెప్తా నీ సంగతి’.. బిగ్‌బాస్ బ్యూటీ లేటెస్ట్ పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ దక్కించుకుంది యాక్టర్ దివి(Divi).

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ దక్కించుకుంది యాక్టర్ దివి(Divi). బీటెక్ కంప్లీట్ చేసిన దివి మూవీల్లోకి అడుగుపెట్టడానికి వీలుగా మోడలింగ్ వైపు వెళ్లానని ఈ నటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. మొదటిసారిగా టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ చిన్నా చితకా పాత్రలతో పాటు పలు కవర్ సాంగ్స్‌లో కూడా స్టెప్పులేసి నెటిజన్లకు దగ్గరైంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)దివికి గాడ్ ఫాదర్ (godfather) సినిమాలో చాన్స్ కల్పించారు. బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే కు వచ్చినప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఇక నయీం డైరీస్ (Naeem's Diaries) రొమాంటిక్ సన్నివేశాల్లో లిమిట్స్ దాటి నటించి.. ప్రేక్షకులకు షాకిచ్చింది. అలాగే నవీన్ గాంధీ దర్శకత్వంలో రూపొందించిన లంబసింగి(Lambasingi)లో తను కథానాయికగా నటించి మెప్పించింది.
కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీ అందానికి, నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా.. జీ 5 లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో దివి అలరించింది. ఇటీవల సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun)నటించిన పుష్ప -2 లో కూడా ఈ ముద్దుగుమ్మ రిపోర్టర్‌గా కనిపించి జనాలను ఆకట్టుకుంది.
అలాగే డాకు మహారాజ్(Daku Maharaj) లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు అనుచరురాలిగా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘చూస్తున్న.. రోజులు లెక్కపెడుతోన్న చెప్తా నీ సంగతి’’ అంటూ రాసుకొచ్చి.. ఆఫ్ శారీ ధరించి పలు ఫొటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






