లైవ్‌లో ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్(వీడియో)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-25 06:37:11  IST  )

‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లైవ్‌లో ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మౌనరాగం’(Mounaragam) సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక జైన్(Priyanka Jain) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా టీవీ(MAA)లో ప్రసారమయ్యే ఈ ధారావాహికకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’(Janaki Kalaganaledhu) సీరియల్‌లో నటించి మరింత ఫేమ్ తెచ్చుకుంది. దీంతో బిగ్ బాస్(Bigg Boss) సీజన్-7లో కంటెస్టెంట్‌గా వెళ్లే చాన్స్ వచ్చింది. అక్కడ తన ఆటతీరు, మాటతీరుతో కొంత పాజిటివిటీ, మరికొంత నెగిటివిటిని తెచ్చుకుంది.

అయితే ఈ బ్యూటీ టాప్ ఫైవ్ కంటెస్టెంగా బిగ్ హౌస్‌లో నిలిచింది. కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఓ యూట్యూబ్ చానల్(Youtube Channel) పెట్టి తన ప్రియుడితో చేసిన రీల్స్, వ్లాగ్స్ పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియాంక ప్రియుడు శివన్ స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే ‘కిర్రాక్ బాయ్స్.. ఖిలాడీ లేడీస్’ సీజన్-2 షోకు ఓ షోకు వచ్చాడు. అక్కడ అతను మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు.

ఆ తర్వాత తన ప్రియురాలు ప్రియాంకకి వీడియో కాల్ చేశారు. అయితే అప్పుడు ఆమె ముందే లైవ్‌లో శివన్ నేను ఈ షోలో గెలిచే వరకు పరి(ప్రియాంక ముద్దు పేరు)కి బ్రేకప్ చెబుతున్న అని అంటాడు. అప్పుడు ప్రియాంక దాన్ని సీరియస్‌గా తీసుకుని ఇప్పుడు మీ పేరెంట్స్‌ను పిలిచి నీకు నాకు సంబంధం లేదని చెప్పేస్తా అని కాల్ కట్ చేస్తుంది. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాక్‌కు గురి అవుతారు. ఇక్కడితో ఈ ప్రోమో అయిపోయింది. మరి అసలు అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఏపిసొడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More..

బంపర్ ఆఫర్ అందుకున్న ఫరియా అబ్దుల్లా.. అదృష్టం అంటే ఇదే అంటున్న నెటిజన్లు

Next Story