హాస్పిటల్‌లో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎంతోమంది అలా చేశారంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-21 15:32:55  IST  )

బుల్లితెర నటి అషు రెడ్డి(Ashu Reddy) పలు షోస్‌లో పాల్గొని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. పలు ఈవెంట్లలోనూ సందడి చేసి అందరినీ మెప్పించింది.

హాస్పిటల్‌లో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎంతోమంది అలా చేశారంటూ ఎమోషనల్ పోస్ట్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
X

దిశ, సినిమా: బుల్లితెర నటి అషు రెడ్డి(Ashu Reddy) పలు షోస్‌లో పాల్గొని ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. పలు ఈవెంట్లలోనూ సందడి చేసి అందరినీ మెప్పించింది. ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షోలోను పాల్గొన్న ఈ భామ తన అందంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్‌గానూ పలు షోస్ చేసిన అషు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన స్టైలిష్ డ్రెస్సులతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే జూనియర్ సమంతగాను పేరు తెచ్చుకున్న అషు రెడ్డి సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఈ అమ్మడు ఛల్ మోహనరంగ(Chal Mohanranga), బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్(Boyfriend for Hire), ఎ మాస్టర్ పీస్(A masterpiece) వంటి చిత్రాల్లోనూ నటించి తన నటనతో మెప్పించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. అందులో ఆమె పంటి నొప్పి ఉన్నప్పటికీ సర్జరీ చేయించుకుంది. ఇక ఇందుకోసం కొంత జుట్టును కూడా తొలగించుకుంది. తలకు కుట్లు వేస్తున్న సమయంలో నొప్పిని భరించలేక ఏడుస్తున్న ఫొటోను కూడా జత చేసింది.

ఒక ఈ వీడియోకు ‘‘‘ఈ జీవితం చాలా చిన్నది ఎంతోమంది, నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా, ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే అషు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పోస్ట్ చూసి ఒక్కసారిగా ఆమెకు ఏమైందో అని కంగారు పడినప్పటికీ నువ్వు ధైర్యవంతురాలివి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అషు రెడ్డి వీడియో నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను కన్నీరు పెట్టిస్తోంది.

Next Story