ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్‌..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే

by velandi.Saikiran |

మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంచనా

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్‌..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో కొనసాగుతూనే, ఇటు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్‌ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపించనుండగా, శ్రీ లీల, రాశి ఖ‌న్నా హీరోయిన్ గా మెరుస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2026 లో రిలీజ్ కానుంది అట. అయితే అలాంటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 5:35 నిమిషాలకు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఖుషి గా కనిపిస్తున్నారు.

Next Story