- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suriya45 టైటిల్ & టీజర్‌పై బిగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సూర్య-45’ (Suriya45) ఒకటి.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘సూర్య-45’ (Suriya45) ఒకటి. Suriya45 అనే వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ చేసిన ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. అనౌన్స్‌మెంట్ తప్ప ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ రాకపోవడంతో సూర్య ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాతో ముచ్చటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు సూర్య 45 టైటిల్ అప్డేట్ జూన్ మూడవ వారంలో విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లు గానే.. తాజాగా సూర్య45 టైటిల్ & టీజర్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ & టీజర్ జూన్ 20న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కాగా.. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.






