Ravi Teja: రవితేజ సినిమాపై బిగ్ అప్డేట్.. విదేశీ షెడ్యూల్ స్టార్ట్ అంటూ పోస్ట్

by Chukka Sudharani |

దర్శకుడు కిషోర్ తిరుమలతో చేతులు కలిపి మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ.

Ravi Teja: రవితేజ సినిమాపై బిగ్ అప్డేట్.. విదేశీ షెడ్యూల్ స్టార్ట్ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: దర్శకుడు కిషోర్ తిరుమలతో చేతులు కలిపి మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. RT76 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నా టీమ్.. ఇప్పుడు విదేశీ షెడ్యూల్ కోసం గేర్ మార్చింది. గత కొన్ని రోజులుగా లొకేషన్ రెక్సీని నిర్వహించగా.. నేటి నుంచి స్పెయిన్‌లోని వాలెన్సియా అండ్ సమీప దీవులలో షూటింగ్ ప్రారంభించింది. తర్వాత ఫ్రాన్స్‌లోని జెనీవాలో కొంత భాగం షూటింగ్ జరుపుకోనున్నారు. ఈ 25 రోజుల విదేశీ షెడ్యూల్‌లో కీలకమైన సీన్స్‌తో పాటు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన రెండు పాటలు ఉండనున్నాయి. అంతే కాకుండా.. RT76 టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేయనున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్‌లో ఉంది.

Next Story