- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: పెద్ది షూటింగ్‌పై బిగ్ అప్డేట్..
‘పెద్ది’ అనే డిఫరెంట్ జానర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.

దిశ, సినిమా: ‘పెద్ది’ అనే డిఫరెంట్ జానర్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి పలు అప్డేట్స్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. షూటింగ్‌లో వేగం పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా పెద్ది సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మైసూర్‌లోని పాండవపుర షుగర్ ఫ్యాక్టరీలో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణను రెండు రోజులు పూర్తి చేశారు చిత్ర బృందం. ఇందులో డ్యాన్సర్లు, కొంత మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు భూత్ బంగ్లాలో గతంలో ఉపయోగించిన క్రికెట్ గ్రౌండ్ సెట్‌లో షూటింగ్ చేస్తుండగా.. రామ్ చరణ్ అమ్మమ్మగారు మరణించడంతో ఆమె అంత్యక్రియలకు హాజరు కావడానికి మైసూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. Link






