Mega 157: మెగా 157 షూటింగ్‌పై బిగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మెగా-157’ (Mega 157)తో బిజీగా ఉన్నాడు.

Mega 157: మెగా 157 షూటింగ్‌పై బిగ్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మెగా-157’ (Mega 157)తో బిజీగా ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక అనౌన్స్‌మెంట్ నుంచే మంచి బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో జరుగుతుందని తెలుస్తుండగా.. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో నయనతారా జాయిన్ అయిందట. ముస్సోరి(Mussoorie)లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రకరిస్తుండగా.. అక్కడే చిరు, నయన్‌పై ఓ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ ప్రాజెక్టును షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్, అర్యన్ ప్రజెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే మెగా అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story