- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhanda-2: అఖండ-2 రిలీజ్ డేట్ అండ్ ఓటీటీ డీల్‌పై బిగ్ అప్డేట్
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా చూస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘అఖండ-2’.

దిశ, సినిమా: నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా చూస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘అఖండ-2’. మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అఖండకు సీక్వెల్‌గా రూపొందబోతుండగా.. ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక భారీ అంచనాల మధ్య అఖండ-2 చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని వర్క్స్ కంప్లీట్ అవ్వని కారణంగా పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అలాగే.. ఈ సినిమా వాయిదాపై బాలకృష్ణ కూడా స్పందిస్తూ.. అఖండ-2 డిసెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాము. తమన్ సంగీతంపై మరింత సమయం కావాలని అన్నాడు.
అఖండకు మించి అఖండ-2 50 రెట్లు బాక్సులు బద్దలైపోతాయి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే అఖండ-2 సినిమా రిలీజ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఆల్మోస్ట్ ఈ డేట్ కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్. ఇక ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మి్స్తున్నారు. ఇందులో సంయుక్త, హర్షల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. లింక్






