VT15 నుంచి బిగ్ అప్డేట్.. కౄషియల్ షెడ్యూల్‌లో వరుణ్..

by Chukka Sudharani |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘VT15’.

VT15 నుంచి బిగ్ అప్డేట్.. కౄషియల్ షెడ్యూల్‌లో వరుణ్..
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘VT15’. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘ప్రస్తుతంVT15 షూటింగ్ హైదరాబాద్‌లోని శరవేగంగా జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొంటున్న ఈ కృషియల్ షెడ్యూల్‌లో చాలా ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు’ అని తెలిపారు. ఇక ఈ చిత్రం వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్ అండ్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది. హారర్‌–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్‌డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండగా.. ఇప్పటికే ఇండియా, విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి గ్రాండ్ విజువల్స్‌ని క్యాప్చర్ చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్స్‌తో అలరించబోతున్నారు.

Next Story