- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి BIG అప్డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu) కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu) కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. పెద్ది ఫస్ట్ సాంగ్‌కు సంబంధించిన న్యూస్ రివీల్ చేశారు. ‘చికిరి’ అనే పాట(Chikiri Song) వస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. అసలు చికిరి అంటే ఏమిటి? పాట ఎప్పుడు వస్తుంది? అనే పూర్తి వివరాలు రేపు ఉదయం 11:07 గంటలకు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. కాగా, గ్రామీణ నేపథ్యంలోని ఆటలతో ముడిపడి ఉన్న బలమైన భావోద్వేగాలు నిండిన కథతో పెద్ది సినిమా ముస్తాబవుతోంది. ఇది వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి రెహమాన్ సంగీతమందిస్తుండగా.. రత్నవేలు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.






