మా ఇంటి బంగారం నుంచి బిగ్ అప్డేట్.. అఫీషియల్ ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్

by Gugulothu.Kavitha |

ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి.. తొలి ప్రయత్నంగా 'శుభం' అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది.

మా ఇంటి బంగారం నుంచి బిగ్ అప్డేట్.. అఫీషియల్ ప్రకటనతో హైప్ పెంచిన మూవీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి.. తొలి ప్రయత్నంగా 'శుభం'(Subham) అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్(Samantha) ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దిగంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అదే బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా 'మా ఇంటి బంగారం' చిత్రం తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి అతి త్వరలో టీజర్ రాబోతుందంటూ మూవీ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు.. ‘సమంత ప్రభు 2’ మా ఇంటి బంగారం టీజర్ అతి త్వరలో విడుదల కానుంది’ అని రాసుకొస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, కాగా ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సమంత(Samantha) రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Link

Next Story