Jack: గెట్ రెడీ.. జాక్ వైబ్ లోడింగ్ అంటూ బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బ్లాక్ బస్టర్ హిట్స్ ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తర్వాత నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ (Most weighted) చిత్రం ‘జాక్’.

Jack: గెట్ రెడీ.. జాక్ వైబ్ లోడింగ్ అంటూ బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బ్లాక్ బస్టర్ హిట్స్ ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) తర్వాత నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ (Most weighted) చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ‘జాక్’ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన ‘కిస్ సాంగ్’ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ (Trailer) రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ‘తేదీని మార్క్ చేసుకోండి.. రెడీగా ఉండండి జాక్ వైబ్ లోడ్ అవుతోంది.. ఏప్రిల్ 2 న ట్రైలర్ రాబోతుంది’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సిద్ధు స్టైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

Next Story