- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధనుష్ ‘ఇడ్లీ కడై’ నుంచి బిగ్ అప్‌డేట్.. త్వరలో అంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’(Idlikadai).

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు)’(Idlikadai). ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్(Nithya Menon) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. డాన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ మూవీలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. అయితే తిరుచిత్రబలం సినిమా తర్వాత నిత్యమీనన్, ధనుష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్(GV Prakash Kumar) మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి అప్‌డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ త్వరలో అప్‌డేట్ రాబోతుందంటూ ట్వీట్ చేశాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేయడంతో అది ఈ సినిమాలోని సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఎలాంటి అప్‌డేట్ రాబోతుందా అని ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ నెలకొన్నది.






