చిరంజీవి సినిమా నుంచి మరో అప్డేట్.. ఏకంగా 7 ఎకరాలలో

by velandi.Saikiran |

ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్లు టాప్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వై

చిరంజీవి సినిమా నుంచి మరో అప్డేట్.. ఏకంగా 7 ఎకరాలలో
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో నయనతార స్టెప్పులు వేయనుంది. సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా ఉన్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మన శంకర వరప్రసాద్‌గారు సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి.

మీసాల పిల్ల పాట సక్సెస్ కాగా, ఇప్పుడు శశిరేఖ అనే సాంగ్ కూడా రాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ రానుంది. మన శంకర వరప్రసాద్‌గారు సినిమాలో చిరంజీవి ఇంట్రో సాంగ్ ఉంటుందట. ఈ పాట షూటింగ్ ఇవాళ్టి నుంచి అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏడు ఎక‌రాలలో సెట్ కూడా వేశారట. ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్లు టాప్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story