బాలీవుడ్ ‘రామాయణం’ లో మరో బిగ్ స్టార్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-08-19 16:02:37  IST  )

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి.

బాలీవుడ్ ‘రామాయణం’ లో మరో బిగ్ స్టార్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌తో పాటు హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా‌తో కలిసి రాకింగ్ స్టార్ యశ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి లుక్స్ నెట్టింట వైరల్ కాగా.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్నా అప్డేట్ వచ్చిన అది నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ‘రామాయణం’ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా ఈ భారీ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతే కాకుండా.. అలాగే ఈ సినిమాలో ఆయన వాయిస్ ఓవర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. లింక్

Next Story