- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకి భారీ షాక్.. సారీ చెప్పాలని డిమాండ్స్
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరో వివాదంలో ఇరుక్కున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల హైదరాబాద్ లో సూర్య(Suriya) హీరోగా నటించిన "రెట్రో"(Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ సూర్య గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకొని అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. అయితే దానితోపాటు ఇటీవల జరిగిన కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)పై ఫైర్ అయ్యారు. 'ఆ టెర్రరిస్టు కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే, ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు. ఏం సాధిస్తారు?. నేను చెప్తున్నా.. కాశ్మీర్ మనదే.. కాశ్మీరులు మనవాళ్లే. 2 ఏళ్ల క్రితం కాశ్మీర్ లో 'ఖుషి' షూటింగ్ చేశా. వాళ్ళతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. పాకిస్థాన్ దేశంలో వాళ్ళ మనుషులనే వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. అక్కడ కరెంట్, నీళ్లు కూడా లేవు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాలని చూస్తున్నారో. పాకిస్థాన్ మీద ఇండియా అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలానే కొనసాగితే అక్కడి ప్రజలే ప్రభుత్వం మీద విరక్తి కలిగి తిరగబడతారు.
500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధిలేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనం భారతీయులందరం ఐకమత్యంతో కలిసుందాం. అందరూ హ్యాపీగా ఉండండి'' అని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే ట్రైబల్ ఉద్యమాలపై విజయ్ చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర గ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ కి గిరిజనుల చరిత్ర తెలియకుండా.. ట్రైబల్ ఉద్యమాలను హేళన చేయడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడుతున్నారు. ఉపన్యాసలిచ్చే ముందు వారి గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఈ సందర్భంగా మన్యం పార్వతీపురం జిల్లా ఆదివాసీ JAC నాయకులు మాట్లాడుతూ.. విజయ్ తన వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణ చెప్పి, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.






