హీరోయిన్ నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు

by Kema Shiva Kumar |

కోలీవుడ్ అందాల భామ నయనతార (Nayantara) చిక్కుల్లో పడింది.

హీరోయిన్ నయనతారకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ అందాల భామ నయనతార (Nayantara) చిక్కుల్లో పడింది. ఇటీవలే ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడులైన విషయం విదితమే. అయితే, ఆ డాక్యుమెంటరీలో నిర్మాతల అనుమతి లేకుండానే నయనతార చంద్రముఖి మూవీ క్లిప్స్‌ను అందులో చేర్చారు. అదేవిధంగా ధనుష్ నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ‘నాన్ రౌడీ ధాన్’ చిత్రం నుంచి కూడా అనధికారికంగా బ్యాక్‌స్టేజ్ ఫుటేజ్‌ను ‘బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ’లో వాడారు. దీంతో ఆ చిత్ర నిర్మాతలైన ఏపీ ఇంటర్నేషనల్, ధనుష్ నిర్మాణ సంస్థ తమ మూవీ క్లిప్స్ అక్రమంగా వినియోగించడంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం హీరోయిన్ నయనతారతో పాటు నెట్‌ప్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా అక్టోబర్ 6 లోపు డాక్యుమెంటరీలో వాడిన మూవీ క్లిప్‌లపై సమాధానం చెప్పాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.

Next Story