ఆస్తులు అమ్ముకుంటున్న టాలీవుడ్ హీరోయిన్ భర్త.. ఆమె కాలు మహిమేనా ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది కష్టపడి పైకి వస్తే మరి

ఆస్తులు అమ్ముకుంటున్న టాలీవుడ్ హీరోయిన్ భర్త.. ఆమె కాలు మహిమేనా ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది కష్టపడి పైకి వస్తే మరి కొంతమంది అందాలు ఆరబోసి... సక్సెస్ రాణిస్తున్నారు. అయితే మరి కొంత మంది చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. కెరటం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి చిన్నచిన్న సినిమాలు చేసి... ఆ తర్వాత స్టార్ హీరోల సరసన చేసింది రకుల్. తెలుగులో ఈ మధ్య కాలంలో సినిమాలు... తీయకుండా కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ పైన దృష్టి పెడుతోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత టాలీవుడ్ సినిమాలకే గుడ్ బై చెప్పేసింది.

అయితే అలాంటి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు కొత్త సమస్యలు వచ్చాయి. ఓ సినిమా కోసం ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాడట రకుల్ భర్త జాకీ భగ్నానీ ( Jackie Bhagnani). అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా, చోటే మియా సినిమా కారణంగా రకుల్ భర్త నిర్మాత జాకీకి నష్టాలు వచ్చాయని సమాచారం అందుతోంది.

ఈ తరుణంలో ఆ సినిమా కోసం ఆస్తులు కూడా తనఖా పెట్టడని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన బాధ ఎవరికి పట్ట బోధని.. ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదని కూడా ఈ సందర్భంగా జాకీ బాధపడ్డట్లు సమాచారం. తాము తీసిన సినిమా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని ఆయనే స్వయంగా అంగీకరించారట. అందుకే సినిమా ఫ్లాప్ అయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. ఈ విషయంలో ప్రేక్షకులను తప్పుపట్టాల్సిన అవసరం లేదని కూడా వివరించారు రకుల్ భర్త జాకీ భగ్నానీ.

Next Story