పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆరు నెలల కడుపుతో ఉన్నానని ఫొటోలు షేరింగ్..

by Sujitha Rachapalli |

కన్నడ నటి భావన తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ట్విన్స్‌కు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంది. పెళ్లి కాకుండా ఇదంతా ఎలా సాధ్యమైందనే స్టోరీ కూడా షేర్

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆరు నెలల కడుపుతో   ఉన్నానని ఫొటోలు షేరింగ్..
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ నటి భావన తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ట్విన్స్‌కు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంది. పెళ్లి కాకుండా ఇదంతా ఎలా సాధ్యమైందనే స్టోరీ కూడా షేర్ చేసింది. తన లాంటి స్త్రీలకు స్ఫూర్తి కలుగుతుందనే ఈ కథను పంచుకుంటున్నట్లు చెప్పింది. తనకు సపోర్ట్‌గా ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు థాంక్స్ చెప్పింది.

‘20,30 ఏళ్లలో తనకెప్పుడూ ఇలా అనిపించలేదు. 40ఏళ్లలో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. సింగిల్‌ మదర్‌గా నా పిల్లలను పెంచాలనుకున్నా. ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనివ్వబోతున్నా. ఇంతకు ముందు చాలా మంది డాక్టర్లు రిజెక్ట్ చేశారు. కానీ తనకు హెల్ప్ చేసిన రెయిన్ బో హాస్పిటల్స్ డాక్టర్‌ సుష్మకు ధన్యవాదాలు. నా స్టోరీ ఒక్కరిని ఇన్‌స్పైర్ చేసినా నాకు హ్యాపీ. త్వరలో రెండు సోల్స్ నన్ను అమ్మ అని పిలవబోతున్నాయి’ అంటూ బిగ్ నోట్ పంచుకుంది. ఈ స్టోరీ అర్థమైన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతుంటే.. అర్థం కాని వారు మాత్రం ప్రెగ్నెంట్ ఎలా అయిందని ప్రశ్నిస్తున్నారు.

LINK

Next Story