‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి అద్దం ముందు స్టెప్పులేసే పాట

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయతి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. కిషోర్ తిరుమల

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి అద్దం ముందు స్టెప్పులేసే పాట
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయతి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ కూడా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’తో మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ చేసిన మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు. కాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

Next Story