‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరికీ నచ్చుతుంది..

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా జనవరి 13న

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరికీ నచ్చుతుంది..
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. ‘కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌తో మన తెలుగు ప్రేక్షకులకు మంచి ఫన్, సాంగ్స్ అన్నీ కలిపిన సినిమా అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుంది. రవితేజతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథ రాయడం జరిగింది. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. మన జీవితం తెరపై చూసుకున్నట్టుగానే ఉంటుంది. రవితేజ గారి మార్క్ ఫన్ మిస్ కాకుండా నా ట్రీట్మెంట్‌తో చాలా ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దా. రవితేజ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే ట్రీట్ చేయడం జరిగింది. క్యారెక్టర్‌నే ఫాలో అయ్యాం’ అని తెలిపాడు.

Next Story