'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ అప్డేట్..

by Gugulothu.Kavitha |

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi).

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ అప్డేట్..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) నటిస్తున్న తాజా సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi). కిశోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చి సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మూవీ టీమ్. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రైలర్ జనవరి 7వ తారీఖున సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఇక పోస్టర్‌లో.. రవితేజ, డింపుల్ హయాతీ, ఆషిక రంగనాథ్ ఓ టేబుల్ చుట్టూ కూర్చొని ఉండగా.. రవితేజ, ఆషికా రొమాంటిక్‌గా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటుండగా.. బుంగమూతి పెట్టుకుని కొంచెం కోపంగా డింపుల్ హయాతీ ఆషిక వైపు చూస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story