మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-03 17:23:14  IST  )

టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన కే-ర్యాంప్ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.

మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన కే-ర్యాంప్ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్(Bandla Ganesh) మాట్లాడుతూ హీరో కిరణ్ అబ్బవరాన్ని ఆకాశానికి ఎత్తారు. ఒక సినిమా హిట్టు పడితే.. తల ఎత్తుకొని తిరిగే హీరోలు ఉన్న ఈరోజుల్లో వరుసగా హిట్లు కొడుతున్నా కిరణ్ అబ్బవరం సింపుల్‌గా ఉంటున్నాడని ప్రశంసించారు. కిరణ్ అబ్బవరం‌ను చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గుర్తొస్తున్నారని అన్నారు. చిరంజీవి కూడా ఇలాగే సింపుల్‌గా ఉంటారని.. రేపో.. మాపో ఆయన భారతరత్న(Bharat Ratna) అందుకోబోతున్నారని బండ్ల గణేష్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంతేకాదు.. కిరణ్ అబ్బవరం కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నందుకు బండ్ల గణేష్ అభినందించారు. ఆయన వరుసగా ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేసి హిట్ కొట్టాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకపోతే మనం ఇండస్ట్రీకి వచ్చేవాళ్లమా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ గతాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రేమతో కష్టపడి పనిచేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమని అన్నారు. భవిష్యత్‌లో కిరణ్ అబ్బవరం మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం ఖాయమని చెప్పారు. వీడియో

Next Story