ఐరెన్ లెగ్ గా మారిన భాగ్య శ్రీ... ప్రమాదంలో ఆ ముగ్గురు హీరోల కెరీర్?

by velandi.Saikiran |   (  Updated:2025-08-09 06:32:02  IST  )

హీరోయిన్ భాగ్యశ్రీ దెబ్బకు మాస్ మహారాజు రవితేజ , విజయ్ దేవరకొండ అలాగే హీరో రామ్ కెరియర్లు నాశనం కాబోతున్నాయని సోషల్ మీ

ఐరెన్ లెగ్ గా మారిన భాగ్య శ్రీ... ప్రమాదంలో ఆ ముగ్గురు హీరోల కెరీర్?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే అవకాశాలను తొందరగా దక్కించుకుంటారు. అలాంటి వారిలో కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashri Borse) ఒకరు. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ మొదట బాలీవుడ్ లోనే అడుగుపెట్టి... ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. యారియన్ 2 సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ 2024లో... మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ తో భాగ్యశ్రీ రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ అందాల తారకు ఏకంగా కింగ్డమ్ సినిమాలోనే అవకాశం వచ్చింది. కింగ్డమ్ సినిమాలో విజయ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముందుగా కలెక్షన్స్ బాగా రాబట్టి... ఆ తర్వాత వెనుకబడిపోయింది.

ఈ నేపథ్యంలోనే... భాగ్యశ్రీ ఖాతాలో రెండో డిజాస్టర్ సినిమాగా నిలిచింది కింగ్డమ్. అయితే ప్రస్తుతం హీరో రామ్, భాగ్యశ్రీ కాంబినేషన్లో మరో కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో వస్తోంది. ఇప్పటికే భాగ్యశ్రీ నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయని.. నెక్స్ట్ రామ్ సినిమా కూడా పోతుందని అంటున్నారు. ఈ ముగ్గురు హీరోలకు ఐరన్ లెగ్ గా హీరోయిన్ భాగ్యశ్రీ మారబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story