- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ అవకాశం రావడం నా అదృష్టం.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’.

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించన్నారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. దుల్కర్, రానాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది. న్యూ కామర్‌కి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం. ఒక చాలెంజ్‌గా ఈ క్యారెక్టర్‌ని తీసుకున్నాను. కుమారి క్యారెక్టర్‌కి ఏం కావాలో గ్రౌండ్ వర్క్ చేశాను. 1960 టైమ్స్‌ని రీ క్రియేట్ చేయాలి. అది చాలా టఫ్ జాబ్. ఈ సినిమా కోసం పాత తెలుగు తమిళ్ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు సావిత్రి గారి నటన గమనించాను. వాటన్నిటినీ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని కుమారిని కొత్తగా రీక్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు. కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. షూటింగ్ అంతా చాలా పాజిటివ్‌గా జరిగింది. అందరం ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళం. ఇది నేను 2023లో విన్న కథ అప్పటి నుంచి మాకు జర్నీ ఉంది. చాలా మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్యూర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. ఒక న్యూ కామర్‌కి ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు’ అంటూ చెప్పుకొచ్చింది.






