- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ (Akhil) ‘లెనిన్’ (Lenin) సినిమాపై నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఫిక్స్ చేశారు. అయితే.. శ్రీలీల(Sree Leela)కు డేట్స్ కుదరకపోవడంతో లెనిన్ చిత్రీకరణ లేట్ అవుతుందనే కారణంగా ఈ బ్యూటీని సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అఖిల్ సరసన నటించే హీరోయిన్‌కు సంబంధించి నెట్టింట ఎన్నో వార్తలు ప్రత్యక్షమయ్యాయి.
ఫైనల్‌గా ఈ మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse)ను ఫిక్స్ చేశారట మేకర్స్. అంతే కాకుండా.. భాగ్యశ్రీకి సినిమా స్క్రిప్ట్ కూడా నచ్చడంతో ‘లెనిన్’కు రీసెంట్‌గా సైన్ కూడా చేసిందట. త్వరలో అఖిల్ అండ్ మిగిలిన తారాగణంతో షూటింగ్ ప్రారంభిస్తుందని ఇండస్ట్రీ నుంచి టాక్. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Link






