- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ బ్యూటీ మమితా బైజుపై సీనియర్ నటుడి విమర్శలు
సీనియర్ నటుడు భాగ్యరాజ్ ‘డూడ్’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ‘ఈ మూవీలో అతిపెద్ద లోపం ఏంటంటే ఆ అమ్మాయి మమిత.

X
దిశ, సినిమా : సీనియర్ నటుడు భాగ్యరాజ్ ‘డూడ్’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ‘ఈ మూవీలో అతిపెద్ద లోపం ఏంటంటే ఆ అమ్మాయి మమిత. ప్రదీప్‌కు ఒకప్పుడు తనను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ అర్థమవుతుంది.. ఆమెను చూడటానికి పరుగెత్తుకుంటూ వస్తాడు. కానీ అప్పుడు హీరోయిన్..‘నువ్వా? లేక అతనా?’ అని గందరగోళంలో పడటం నాకు అర్థం కాలేదు. అది ఏ రకమైన మానసిక స్థితి? ఒక స్త్రీకి ఒకడే కావాలని అనిపిస్తే.. చివరి వరకూ అదే ఉండాలి. అలా కాకుండా గందరగోళంలో ఉంటే దానర్థం ఏమిటి? అంతేకాదు, దీన్ని కామెడీగా తీసుకోవాలని ప్రయత్నించినా అది కామెడీగా సాగలేదు. సీరియస్‌గా తీసుకుంటే కూడా అది ఫ్లాట్‌గా అనిపించింది. అందుకే సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులతో సరిగ్గా కనెక్ట్ కాలేదు’ అని చెప్పుకొచ్చాడు.
Next Story






