- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్‌డే స్పెషల్‌గా ‘భద్రకాళి’ నుంచి టీజర్ రిలీజ్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘భద్రకాళి’(Bhadrakali).

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘భద్రకాళి’(Bhadrakali). ఇక దీన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే తమిళంలో ‘శక్తి తురుగమన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోని బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘దారిచూపడానికి వచ్చిన స్వామి విత్తనమై మొలకెత్తాడు’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. అలా 2 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న టీజర్‌లో అనేక రకాల సన్నివేశాలు చూపించి రక్తి కట్టించారు. సంభాషణలు, విజువల్స్ కూడా బాగున్నాయి. ఇక ఈ వీడియో కింద విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






