Suhas : ప్రాణ స్నేహితుడు ఆత్మహత్య.. టాలీవుడ్ యంగ్ హీరో ఎమోషనల్ పోస్ట్

by Phanindra |

ఇన్‌స్టాగ్రామ్ లో ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన పోస్టులు పెట్టె ఈ యంగ్ హీరో మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Suhas : ప్రాణ స్నేహితుడు ఆత్మహత్య.. టాలీవుడ్ యంగ్ హీరో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో సుహాస్ ( Suhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ లో ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన పోస్టులు పెట్టె ఈ యంగ్ హీరో మొదటిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. పెట్టిన కొంతసేపటికి నెట్టింటి వైరల్ అయింది. అసలు, ఆ పోస్ట్ లో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..

తనకి బాగా ఇష్టమైన ఫ్రెండ్ మనోజ్ ( Manoj) సూసైడ్ ( suicide ) చేసుకున్నాడంటూ చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు సుహాస్. " అసలేమైందో ఇప్పటికి నాకు తెలియదు. కానీ, వాడు ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు. ధైర్యవంతుడు కూడా.. ఇప్పుడు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు.. ఎంత పని చేశావ్‌రా నా కొడకా అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో పోస్టులో రాసుకొచ్చాడు. తన స్నేహితుడితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్, నెటిజన్లు సుహాస్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత కష్టం వచ్చిన ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబర్‌గా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ చిన్న చిన్న సినిమాలు చేసుకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్ లో మెప్పించిన సుహాస్ ( Suhas ) ఇప్పుడు సోలో హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మంచి కథలను ఎంచుకుని ప్రేక్షకులు అలరిస్తున్నాడు. ప్రస్తుతం, సుహాస్ చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం, ఓ భామ అయ్యో రామ ( o bhama ayyo rama ) అనే చిత్రంలో సుహాస్ నటిస్తున్నాడు. దీనిని సమ్మర్ లో మన ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Next Story