- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె అందం వెనుక ఓ ఎక్స్‌ట్రార్డినరి కోపం దాగి ఉంది.. 8 వసంతాలు నుంచి బిగ్ అప్‌డేట్ ఇస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
మ్యాడ్(Mad) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu).

దిశ, వెబ్‌డెస్క్: మ్యాడ్(Mad) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘8 వసంతాలు’(8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా జూన్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇస్తూ హీరోయిన్ పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా .. ఆమె అందం వెనుక, అసాధారణమైన కోపం & కోరిక దాగి ఉంది.. భావోద్వేగ తుఫానుకు సిద్ధంగా ఉండండి. జూన్ 15న 8 వసంతాలు ట్రైలర్ విడుదల కాబోతుంది’ అని రాసుకొచ్చారు.
ఇక పోస్టర్‌లో అనంతిక గ్రే కలర్ ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుని పోనిటెల్ వేసుకుంది. అలాగే ఓ చేతిలో బ్యాగ్ పట్టుకుని ముఖం మీద గాయాలతో, చేతిపై రక్తపు మరకలతో చూడటానికి చాలా సీరియస్ లుక్‌లో కనిపించింది. ఇక ఆమెకు రైట్ సైడ్‌లో కాళిక అమ్మవారు చాలా కోపంగా నాలుక బయటపెట్టి చూస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.






