తిరిగొచ్చిన అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్..బండారం బ‌య‌ట‌పెట్టిన‌ సన్నీ యాదవ్ !

by velandi.Saikiran |

అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ వివాదంపై షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టాడు బయ్యా సన్నీ యాదవ్. ఈ మేర‌కు వీడియో రిలీజ్ చేశాడు.

తిరిగొచ్చిన అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్..బండారం బ‌య‌ట‌పెట్టిన‌ సన్నీ యాదవ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో అన్వేష్ బాగా పాపులర్ అయిపోయాడు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్వేష్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. మొదట చిన్న ఉద్యోగం చేసిన అన్వేష్, ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా పాపులర్ అయ్యాడు. కరోనా సమయంలో యూట్యూబ్ ప్రారంభించిన అన్వేష్, ఇప్పుడు నెలకు ఎనిమిది లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగినట్లు చెబుతున్నారు. అయితే అలాంటి అన్వేష్ గురించి గత రెండు రోజుల నుంచి ఓ వార్త వైరల్ అవుతుంది. అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ మాయం కావ‌డం, రెండు రోజుల్లోనే మ‌ళ్లీ ద‌ర్శ‌నం ఇవ్వ‌డంపై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ వచ్చేసింది

యూట్యూబర్ అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేశారని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. హిందూ ధర్మం, హిందూ దేవుళ్లను కించపరుస్తూ వీడియోలు పెట్టిన నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ పై మెటా సంస్థ యాక్షన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అన్వేష్ పై ఇప్పటికే కేసులు నమోదు చేశారు హిందూ ధర్మ పరిరక్షణ ప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ నేతలు. అయితే ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ( instagram) అకౌంట్ పై వేటు పడిందని ప్రచారం జరిగింది. అయితే, అసలు విషయం అది కాదట. ఏపీలో మొన్న మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడట. ఆ సందర్భంగా కొన్ని పర్మిషన్స్ అడ్డంకి కావడంతో అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంటు మాయమైనట్లు స్వయంగా ప్రపంచ యాత్రికుడే కూడా వెల్లడించారు. 48 గంటల తర్వాత తన అకౌంటు మళ్ళీ వచ్చేసిందని ఓ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరోసారి పేర్కొన్నాడు అన్వేష్. దీంతో అతని ఫాన్స్ ఊపిరి పీల్చుకోగా.. హిందూ ధర్మ పరిరక్షణ వాదులు మాత్రం సీరియస్ అవుతున్నారు.

అన్వేష్ అకౌంట్ పై షాకింగ్ వీడియో పెట్టిన భయ్యా సన్నీ యాదవ్

అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ( naa anveshana instagram) అకౌంట్ మాయమైపోయిందని.. ఆ అకౌంట్ పై బ్యాన్ విధించారని మొన్న వార్త వచ్చిన నేపథ్యంలో వెంటనే భయ్యా స‌న్నీ యాదవ్ ఓ వీడియో చేశారు. అన్వేష్ వి అన్ని డ్రామాలు అని.. కావాలనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకుండా కుట్రకు తెర లేపాడని భయ్యా సన్నీ యాదవ్ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో అన్వేష్ కు ఛాన‌ల్స్ కు వ్యూస్ తక్కువ అయ్యాయని పేర్కొన్నారు. అందుకే తెలుగు ప్రజలు అన్వేష్ గురించి చర్చించుకోవాలని ఇలా ఇన్ స్టాగ్రామ్ పేరుతో డ్రామాలాడాడని షాకింగ్ నిజాలను బయటపెట్టారు భయ్యా సన్నీ యాదవ్. ఇలా అన్వేష్ గురించి రెండు వీడియోలు పెట్టి అన్వేష్‌ బండారం బయటపెట్టాడు భ‌య్యా స‌న్నీ యాదవ్ ( Bayya Sunny Yadav). ఇక భయ్యా సన్నీ యాదవ్ చెప్పినట్లుగానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసిందని అన్వేష్‌ స్వయంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Next Story