Basil Joseph : బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘లోకా: చాప్టర్-1’.. అనవసరంగా అందులో చాన్స్ మిస్ చేసుకున్నా అంటున్న హీరో

by Chukka Sudharani |

చిన్న సినిమాగా వచ్చి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంది ‘లోకా: చాప్టర్-1’.

Basil Joseph : బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘లోకా: చాప్టర్-1’.. అనవసరంగా అందులో చాన్స్ మిస్ చేసుకున్నా అంటున్న హీరో
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంది ‘లోకా: చాప్టర్-1’. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్, టోవినో థామస్, మమ్ముట్టి తదితరు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఆగస్టు 28న వచ్చి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ చిత్రంపై తాజాగా మలయాళ స్టార్ నటుడు బాసిల్ జోసెఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఈ సినిమాలో నటించే ఆఫర్ తనకు రాగా.. రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చాడు జోసెఫ్. రీసెంట్‌గా ఓ చిట్‌చాల్‌లో పాల్గొన్న ఆయన ఈ సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ ‘డైరెక్టర్ డామినిక్‌ అరుణ్‌ ‘లోకా: చాప్టర్-1’లో నాకు ముఖ్యమైన పాత్రను ఆఫర్ చేశారు. కథ కూడా చెప్తానని చెప్పారు.. అయితే అప్పుడు నేను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండగా లోకా సినిమాకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ చూస్తుంటే మంచి ఆఫర్ మిస్ చేసుకున్నా అనిపించింది’ అని తెలిపారు. అయితే.. లోకాలో ముఖ్యమైన పాత్ర అన్నారు కానీ, ఏ రోల్ అనేది మాత్రం రివీల్ చేయలేదు బాసిల్ జోసెఫ్.

Next Story