Barroz3D: ఓటీటీలోకి ‘బరోజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by sudharani |
Barroz3D: ఓటీటీలోకి ‘బరోజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) స్వీయ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్’(Barroz3D : Guardian of Treasure). 3Dలో తెరకెక్కిన ఈ మూవీని మోహన్ లాల్ తన సొంతం నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరుంబవూర్‌‌తో కలిసి నిర్మించారు. రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్ స్పెషల్‌గా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. కేవలం మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం రూ. 20 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ (Digital streaming)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ‘బరోజ్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ‘‘బరోజ్: ది గార్డియన్ ఆఫ్ ట్రెజర్’ మ్యాజిక్ త్వరలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో రాబోతోంది’ అనే క్యాప్షన్ ఇచ్చి తెలిపారు. అయితే.. స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించగా.. తుహిన్ మీనన్, కల్లిర్రోయ్ టిజియాఫెటా, సీజర్ లోరెంటే ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Next Story

Most Viewed