- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బరాబర్ ప్రేమిస్తా.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కథే వేరు..
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

దిశ, సినిమా : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అందరిలో జోష్ నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో.. ‘మా సినిమా ప్రమోషన్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న ‘బారాబర్ ప్రేమిస్తా’ సినిమాతో విక్టరీ కొట్టబోతున్నామని నమ్మకంగా చెబుతున్నా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’ అని కోరాడు.






