- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాపు.. నాట్ ఏ ఫాదర్ స్టోరీ.. ఇట్స్ ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ!
టాలీవుడ్ నటులు బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలతో డైరెక్టర్ దయ తెరకెక్కించిన చిత్రం 'బాపు'.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటులు బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలతో డైరెక్టర్ దయ తెరకెక్కించిన చిత్రం 'బాపు'. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో 'బలగం సుధాకర్ రెడ్డి' టైటిల్ పాత్రలో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మధ్య కాలంలో పల్లెటూరు నేపథ్యం ఉన్న కథలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సినిమా 'బాపు'తో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.
'బాపు'.. ఈ సినిమాను పూర్తిగా తెలంగాణ నేపథ్యంలోనే నిర్మాంచారు మేకర్స్. బాపు అంటే తెలంగాణలో తండ్రి అని అర్ధం. ఈ సినిమాకి ట్యాగ్ లైన్ కూడా 'ఏ ఫాదర్ స్టోరీ', కానీ ఇది ఒక ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ. దురాశ మరియు అత్యాశ.. ఈ రెండు మనిషిని ఎంతలా మారుస్తాయనేది ఈ సినిమాలో అసలైన అంశంగా చూపించారు. దీనికి తోడుగా ఒక రైతుకి భూమితో ఎటువంటి అనుబంధం ఉంటుందనేది కూడా తెలుసుకోవచ్చు. పండిన పంట చేతికొచ్చేవరకు, చేతికొచ్చిన పంట అమ్ముకునే వరకు రైతు పడే ఇబ్బందులను, రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను, అప్పులపాలైనా తన సంసార సాగరాన్ని ఎలా నెగ్గాలి అని ఆ రైతుకు ఓ తండ్రిగా ఉన్న బాధ్యతలను నిజ జీవితానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.
ఇక ఈ సినిమా కంటే ముందు తెలంగాణ నేపథ్యంలోనే వచ్చిన మరో సినిమా 'బలగం'. బలగం మూవీలో తండ్రి చనిపోయాక ఆ కుటుంబం ఎలా కలిసిపోయిందనేది కథ, కానీ బాపు సినిమాలో మాత్రం తండ్రిని చంపాటానికి ఆ కుటుంబం ఎలా ఏకమైంది అనేది కథ. రైతు చనిపోతే ప్రభుత్వం ఇచ్చే రైతు భీమా పైసలతో తన కుటుంబ కష్టాలు తీరుతాయని భావించి తన తండ్రినే చంపడానికి కొడుకు మరియు కుటుంబ సభ్యులు ఎంతలా దిగజారారో చూడొచ్చు. అలాగే, ఆ విషయం తెలిసికూడా ఆ తండ్రి తన కొడుకు కుటుంబాన్ని కాపాడడం అనేవి నేటి మానవీయ, మారిన విలువలకు నిదర్శనంగా దర్శకుడు తెరకెక్కించాడు.
కష్టపడి పనిచేయడం తప్ప రైతుల చేతిలో ఏమి ఉండదు. రెక్కల కష్టం నమ్ముకున్న రైతుకు ఏ కష్టమొచ్చినా దేవుడే దిక్కు. సరిగ్గా ఇదే అంశాన్ని సినిమాలో చాలా చక్కగా చూపించారు. నేటి సమాజంలో నైతిక విలువలు ఎంతలా పడిపోయాయి, మనిషికి అసలైన ఆస్తులేంటి, స్వార్ధపూరిత ఆప్యాయతల ప్రస్తుత కాలంలో.. మనకు మన కుటుంబం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






