‘మీ వల్ల అవ్వుద్దా చెప్పండి’.. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన చిత్రాల్లో తీన్‌మార్(Teen Maar Movie) ఒకటి.

‘మీ వల్ల అవ్వుద్దా చెప్పండి’.. పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు బండ్ల గణేష్ షాకింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన చిత్రాల్లో తీన్‌మార్(Teen Maar Movie) ఒకటి. అప్పటివరకు వరుస ప్లాఫులతో ఉన్న పవన్‌కు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు భావించారు. ఇందులో పవన్ కల్యాణ్ డబుల్ రోల్‌లో నటించడంతో మరింత హోప్స్ పెంచుకున్నారు. తీరా చూస్తే ఈ చిత్రం కూడా అభిమానులను ఘోరంగా నిరాశపర్చింది. 2011 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫైనాన్షియల్‌గా అనుకున్న విజయం సాధించలేదు. పరమేశ్వరా ఆర్ట్స్(Parameswara Art Productions) బ్యానర్‌పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా, జయంత్ సీ.పరాంజీ(Jayanth C. Paranjee) దర్శకత్వం వహించారు. త్రిష, కృతి కర్భంద హీరోయిన్లుగా నటించారు. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్మాత బండ్ల గణేష్‌(Bandla Ganesh)ను రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ పోస్టులకు బండ్లన్న స్పందిస్తూ.. ‘రిలీజ్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. మరి మీరు బ్లాక్ బస్టర్ చేయగలరా?’ అని షాకింగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


కాగా, ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి పరిపాలనపై ఫోకస్ పెట్టారు. సమయం దొరికినప్పుడల్లా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) చిత్రాన్ని ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు 90 శాతం వరకు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇందులో సగభాగానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించగా, మిగిలిన పోర్షన్‌ను నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాబీడియోల్, సునీల్, నాజర్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు సుజిత్‌తో ఓజీ(OG), హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.

Next Story