- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సింహాన్ని దూరం నుంచే చూడండి.. దగ్గరకు వెళ్లి మరీ కెలుక్కోకండి’.. పవన్ ఆగ్రహం వేళ బండ్లన్న ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) మధ్య స్నేహం గురించి అందరికీ తెలుసు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh) మధ్య స్నేహం గురించి అందరికీ తెలుసు. పవన్ హీరోగా బండన్న ఒకటి, రెండు సినిమాలను కూడా నిర్మించారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్‌పై ఎవరు విమర్శలు చేసినా వెంటనే స్పందించి.. కౌంటర్లు ఇస్తుంటారు. గతంలో పవన్‌కు మద్దతుగా టీవీ డిబెట్లలోనూ పాల్గొన్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేష్ పరోక్ష ట్వీట్ పెట్టారు. ‘‘సింహాన్ని దూరంగా చూడండి తప్పులేదు. దగ్గరికి వెళ్లి మరీ కెలుక్కున్నారనుకో.. ఇక మీ ఇష్టం’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు.
అయితే.. బండ్ల గణేష్ ట్వీట్‌కు గంట ముందే.. టాలీవుడ్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని అసహనం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా అవమానించిందో మరిచిపోయారని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని అన్నారు. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తానని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక శనివారం ప్రకటన విడుదల చేసింది.
తమ డిమాండ్‌లు నెరవేర్చాలని లేకపోతే, జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అంటూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. పవన్ ఆగ్రహం పైనే బండ్ల గణేష్ ట్వీట్ పెట్టారని.. సూపర్ బండ్లన్నా అంటూ ఆయన ట్వీట్‌ను పవన్ కల్యాణ్ వైరల్ చేస్తున్నారు.
సింహాన్ని దూరంగా చూడండి తప్పులేదు. దగ్గరికి వేల్లి కెలికారా , ఇక మీ ఇష్టం……..!!!!!!!
— BANDLA GANESH. (@ganeshbandla) May 24, 2025






