మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-04 12:07:55  IST  )

టాలీవుడ్(Tollywood) స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా.. క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. నిన్న కిరణ్ అబ్బవరం కే-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. మరోవైపు.. ఓ యంగ్ హీరోను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క సినిమా హిట్టు పడగానే అర్ధరాత్రి కళ్లజోడు తీయట్లేడని విమర్శించారు. అయితే.. విజయ్ దేవరకొండను ఉద్దేశించే బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారని నెట్టింట తీవ్ర చర్య నడుస్తోంది. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో బండ్ల గణేష్ సినిమా ఓకే అయిందని.. ఇక నుంచి మళ్లీ ప్రొడ్యూసర్‌గా వేగం పెంచబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వివరణ పోస్టు పెట్టారు.

‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం.. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు.. అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు.. దయచేసి తప్పుడు వార్తలు రాయకండి.. నన్ను ఇబ్బంది పెట్టకండి.. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో ఉండాలి.. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను’’ బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు.

READ MORE ....

ప‌వ‌న్ తో కాదు...చిరంజీవితో బండ్ల గణేష్ అదిరిపోయే సినిమా ?

Next Story