Mega 158: 'బండ్ల గణేష్'కు అలాంటి పాత్ర?

by Pulgam srinivas |

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే 'మెగా 158' చిత్రంలో బండ్ల గణేష్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Mega 158: బండ్ల గణేష్కు అలాంటి పాత్ర?
X

దిశ, వెబ్ డెస్క్ : బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాల పాటు అలాగే కెరీర్ను కొనసాగించిన ఈయన ఆ తర్వాత ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. నిర్మాతగా చాలా సినిమాలను నిర్మించారు. ఆ సమయంలో నటనవైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. గణేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం సినిమాల్లో నటించడం లేదు, అలాగే నిర్మించడం కూడా లేదు. తాజాగా ఈయనకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలో మంచి అవకాశం వచ్చినట్లు, ఆయనపై ఏకంగా అనేక అద్భుతమైన సన్నివేశాలు కూడా మేకర్స్ డిజైన్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా? అదే మెగా 158. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బండ్ల గణేష్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు, ఈ సినిమాలో ఆయనకు ఏకంగా 10 సన్నివేశాలు ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ ఓ స్టార్ హీరో సినిమాలో భాగం కానున్నట్లు వార్తలు వస్తుండడం, అందులో ఆయనకు మంచి ప్రాముఖ్యత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని తెలియడంతో ఈ సినిమా గనుక మంచి ప్రేక్షకాదరణ పొందినట్లయితే 'బండ్ల గణేష్'కి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. దానితో వీరిద్దరి కాంబోలో రాబోయే రెండవ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Next Story