చిరంజీవి కోసం స్పెష‌ల్ సింహాస‌నం..బండ్ల గణేష్ ట్వీట్ వైర‌ల్‌

by velandi.Saikiran |

మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టి, మర్యాదలు చేశారు. అయితే ఈ విషయంపై కాసేపటికి క్రితమే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా

చిరంజీవి కోసం స్పెష‌ల్ సింహాస‌నం..బండ్ల గణేష్ ట్వీట్ వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతను ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్, ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక బండ్ల గణేష్ ఎవరినైనా అభిమానించాడంటే, సదరు వ్యక్తిని దేవుడిలా భావిస్తాడు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బండ్ల గణేష్ అభిమానాన్ని మనం చూడవచ్చు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై కూడా తన ప్రేమను చూపించాడు బండ్ల గణేష్. చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఓ కుర్చీ తయారు చేయించినట్లు తాజాగా పోస్ట్ పెట్టారు.

దీపావ‌ళి పండుగ నేపథ్యంలో బండ్ల గణేష్ ఇంట‌ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు బండ్ల గణేష్. దీంతో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, మౌళి లాంటి ప్రముఖ నటులు బండ్ల గణేష్ ఇంటికి వచ్చి, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వస్తాడని ముందే ప్లాన్ చేసుకున్న బండ్ల గణేష్... ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ తయారు చేయించారు.

అందులోనే మెగాస్టార్ చిరంజీవిని కూర్చోబెట్టి, మర్యాదలు చేశారు. అయితే ఈ విషయంపై కాసేపటికి క్రితమే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. మా బాస్ చిరంజీవి మా ఇంటికి వస్తున్నారని, ఆయనపై ప్రేమతో ఈ సింహాసనం తయారు చేయించానని పోస్టులో రాసుకోవచ్చారు. అందులో చిరంజీవి కూర్చున్న క్షణం తన మనసు ఎంతో ఉప్పొంగిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బండ్ల గణేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. క్లిక్







Next Story