రామ్ చరణ్‌తో ఆ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతం.. దిల్‌రాజుకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్?

by Gantepaka Srikanth |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించినంత విజయం సాధించలేదు.

రామ్ చరణ్‌తో ఆ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతం.. దిల్‌రాజుకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించినంత విజయం సాధించలేదు. ముఖ్యంగా ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజాగా.. ఈ సినిమాపై నిర్మాత దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన కుబేర సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో దిల్ రాజు(Dil Raju) పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించడం తాను తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం. ఆ సినిమా చేస్తున్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపాను’ అని దిల్‌రాజు బహిరంగంగా చెప్పటం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దిల్‌రాజు వ్యాఖ్యలపై టాలీవుడ్ మరో నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడే అనే సినిమా నిర్మించడం నా పూర్వజన్మ సుకృతం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్ల వైరల్‌గా మారింది.

కాగా, రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాకు దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ అయిందని.. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిందని వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాగా ఆడడంతో దిల్ రాజు కాస్త ఊపిరి పీల్చుకున్నారనీ ఆర్టికల్స్ వచ్చాయి. ట్వీట్

Next Story